National

ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై FSSAI కొరడా.. విక్రయాలపై తక్షణ నిషేధం

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విస్కీ, రమ్ ప్రియులకు, ప్రముఖ మద్యం తయారీ సంస్థలకు షాక్ ఇచ్చింది. డయాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రెవ్ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే పలు ప్రముఖ బ్రాండ్ల విక్రయాలపై తక్షణ నిషేధం విధించినట్లు సమాచారం.

ఆహార, పానీయాల భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో కొన్ని ఉత్పత్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉత్పత్తుల తయారీ విధానం, ఉపయోగిస్తున్న పదార్థాలు, ఫ్లేవరింగ్‌కు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

FSSAI నిర్ణయంతో ఆయా కంపెనీలకు చెందిన కొన్ని ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్ల విక్రయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారుల ఆరోగ్యం, ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదనే ఉద్దేశంతో నియంత్రణ సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే నిషేధం వర్తించే ఉత్పత్తులు, కంపెనీలపై తదుపరి చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.