CINEMA

విజయ్‌కు కోర్టులో ఊరట.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయపరంగా కీలక ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో కొనసాగుతున్న కేసుకు తాత్కాలికంగా తెరపడింది. దీంతో ఈ కేసును న్యాయస్థానం అధికారికంగా ముగిస్తున్నట్లు ప్రకటించింది.

2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు.

సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ పరిణామంతో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ఈ కుటుంబ వివాదానికి ప్రస్తుతానికి ముగింపు పలికినట్లైంది.