AP

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా..: బొత్స సత్యనారాయణ..

రెండవ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్షనేత,బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అక్రమాల పై విచారణకు భయపడి పారిపోయిందని అన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు చర్చ కోరితే పారిపోతున్నారని, అక్రమాలకు ఆధారాలున్నా స్పందంచడం లేదని అన్నారు.

మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే సమాధానం లేదు. ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారని అన్నారు. రెండులరోజులు పొడిగించైనా చర్చిద్దామంటే మాట్లాడటం లేదు. డీఎస్సీలో అక్రమాల పై విచారణకు భయపడపతున్నారంటేనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. డీఎస్సీలో 3% కోటా ఇచ్చారు. జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపారని తెలిపారు. ఆ తర్వాత జీవోలు రద్దు చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ప్రాధాన్యం లేకుండా చేశారని, మా ప్రశ్నలు కరెక్ట్ కాదంటే చర్చకు రండి ఉదయం నుంచి చర్చ కోసం అడుగుతూనే ఉన్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. చర్చ పెట్టండి అర్ధరాత్రైనా మేం సభలోనే ఉంటామన్నారు. డీఎస్సీ పై చర్చ జరగాలి. మా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. వ్యవసాయ మంత్రి లేకుండానే వ్యవసాయం పై సభలో చర్చిస్తారట.. మా డిమాండ్ సమంజసమో కాదో ప్రజలే చెప్పాలని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుందని సెటేర్లు వేసారు. చంద్రబాబు కరువు కవల పిలల్లు. వ్యవసాయమే దండగ అన్న పార్టీ వెన్నుపోటు పార్టీ అని అన్నారు.

సిబిఐ విచారణ..

ఆ పార్టీ నేతలకు వ్యవసాయమంటేనే నచ్చదని, పోలీస్ వ్యవస్థ లేనే లేదు.. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తామన్నారు. ఇద్దరు ఎస్ఐ లు గంజాయితో దొరకడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. గంజాయి తగ్గడం కంటే ఇంకా పెరిగిపోయిందని, మొక్కుబడిగా సభ పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ పై సిబిఐ విచారణ జరిపించండని అన్నారు.