సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం SC/ST Act, 1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని ఎర్ఫాటు చేశారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ చైర్మన్లు, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చట్టం అమలుపై స్టేట్ లెవల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. అయితే రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో చర్చిచనున్నారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదని, 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీదని అన్నారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులేనని అన్నారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నామని, సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నారన్నారు. దళితులు, గిరిజనులు,ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, 0అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని సీఎం తెలిపారు. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
చదువొక్కటే జీవితాలను మారుస్తుంది. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదని సీఎం రేవంత్ రెడ్డి క్లానిటీ ఇచ్చారు. పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించండి. రాజకీయాలకి అతీతంగా ఈ వర్గాల అభివృద్ధి చేసుకుందాం ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుందని తెలిపారు. ఎల్ నినో,22A, పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లు,ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు పైన చర్చించే అవకాశం ఉందని అక్కడి అధికారులకు సమాచారం!

