నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్టోన్నారు. రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సభ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం తెలిపారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతున్నామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మూడు పల్లె పండుగలు నిర్వ హించుకున్నామని అన్నీ సక్సెస్ అయ్యాయని అన్నారు. ఉద్యమ స్పూర్తితో పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ రెండేళ్లల్లో అభివృద్ధి చేస్తోందని అన్నారు. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నామని, సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో రాష్ట్రాన్ని నిలబెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, 2024 ఎన్నికల నాటి కంటే ఎన్డీఏ హవా పెరిగిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు మహిళలు, ప్రజలు సిద్దంగా ఉన్నారని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయన్నారు. నాటి దుస్థితి నుంచి పవన్ కళ్యాణ్ పల్లెలను అభివృద్ధి బాట పట్టించారు. పల్లెల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తన దైన మార్క్ వేశారని, గ్రామ వికాసంలో భాగంగా పవన్ అనేక మార్పులు తెచ్చారని చెప్పుకొచ్చారు.
నాటి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లల్లో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లను మాత్రమే వేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లల్లో 6500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసి చరిత్ర సృష్టించిందని చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు వైఎ స్సార్ పార్టీ దొంగల జేబుల్లోకి వెళ్లాయని, ఇప్పుడు ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 2 పూర్తి చేస్తామని, ఉదయగిరికి నీటిని తీసుకొస్తామని, ఏపీ నీ నాలెడ్జ్ హబ్‌గా చేసి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత మాదని సమస్యలు పుష్కరించే బాధ్యత మాదపి మీకు అండగా ఉండే బాధ్యత మాదని సీఎం చంద్రబాబు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారని, పీఎం ప్రధాని వల్లే పల్లె పండుగను ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తామని, ఉదయగిరిలో వలసలు ఎక్కువయ్యాయని అవి తగ్గించేందుకే ఇక్కడ పల్లె పండుగ 3.0 పెట్టామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రెండేళ్లలో పంచాయతీ రాజ్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, 2019-2024 వరకు ఏపీలో 850 కిలో మీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే మేము 9 వేల కిలో మీటర్ల మేర రోడ్లు వేశామని అన్నారు. SC, ST కాలనిలో 6 వేల కిలో మీటర్ల మేర రోడ్లు వేశామని, రాబోయే రెండేళ్లలో పంచాయతీ రాజ్ ద్వారా లక్షా30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ఉదయగిరి కోటకు చేరుకునే రోడ్డు నిర్మాణానికి నిధులు.. కోటను టూరిజం హబ్ గా తయారు చేస్తామని అన్నారు.

