ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. వైసీపీపై పార్టీ ఆధిక్యాన్ని తగ్గించి కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలను కూటిమి ప్రభుత్వం కైవసం చేసుకుంది...
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన పులివెందులలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠం టిడిపి కైవసం చేసుకుంది. పులివెందులలో వైసిపి అభ్యర్థి అయిన వైయస్ ప్రమీలమ్మపై 13,875 ఓట్ల మెజారిటితో టిడిపి అభ్యర్థి తూగుట్ల గీత గెలిచారు. పోలింగ్ జరిగిన 20 వార్డుల్లో 15 వార్డులు టిడిపి, జనసేన 1,బీజేపి 1 కైవసం చేసుకున్నాయి. దీంతో కేవలం 3 వార్డుల్లో మాత్రమే వైసీపీ పార్టీ నెగ్గింది.
పులివెందులలో ఉన్న మొత్తం 40 వార్డుల్లో 34 సీట్లు టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 3 చోట్ల వైసీపీ, 1 చోట జనసేన అభ్యర్థులు గెలిచారు.ఇక వైసీపీ పార్టీ నుండి జగన్ తాలుకాలో గెలవక పోవడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. గెలుపోందిన చోట కూటమి నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంభరాలు చేసుకుంటున్నారు.

