TELANGANA

తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు..!

తెలంగాణ జనసేనలో భారీ సంస్థాగత ప్రక్షాళన చేసారు. పార్టీలో కీలక పదవులన్నీ రద్దు చేస్తూ జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2, 2026కు ముందు నియమించిన అన్ని పదవులు రద్దు చేస్తూ అదిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పదవులు మోత్తం జనసేన రద్దు చేసింది. GHMC, మున్సిపల్, కార్పొరేషన్ ఇన్‌చార్జ్‌ల నియామకాలను సైతం రద్దు చేసారు.

వీటితో పాటుగా POCలు, పార్లమెంట్, ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ల పదవులూ రద్దు చేశారు. విద్యార్థి, యువజన, వీరమహిళ విభాగాల పాత కమిటీల రద్దు చేశారు. పాత, కొత్త అడహక్ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటన చేసింది. జూన్ 2 తర్వాత ఏర్పాటైన జాయినింగ్ కమిటీ, అధికార ప్రతినిధులు యథాతథం ఉన్నట్టు జనసేన క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కొత్త కమిటీలు, కొత్త బాధ్యతలతో జనసేన పునర్వ్యవస్థీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. యువత, మహిళలు, విద్యావంతులు, అన్ని సామాజిక వర్గాలకు కొత్త కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన సంస్థాగత బలోపేతం చేస్తుంది. GHMC, MMC, CMC, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధత కోసం.. ZPTC, MPTC, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి పోటీకి కార్యాచరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పదవుల రద్దు సేవలకు ముగింపు కాదు.. కొత్త బాధ్యతలకు మార్గమని జనసేన స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా కొత్త కమిటీల ఏర్పాటు చేస్తామని ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దడమే లక్యం అని పేర్కోన్నారు.