కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

