4news HD TV

National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది. బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు…

TELANGANA

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డితో కరణ్ అదానీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా.. తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు.…

CINEMA

సలార్, డంకీకి సైలెంట్ గా షాక్ ఇచ్చిన హీరో, ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా హీరోలు !

సలార్, డంకీ సినిమాలకు కాటేరా అనే ప్రాంతీయ సినిమా ఇచ్చిన షాక్ కు ప్రభాస్ ఫ్యాన్స్, కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకప్పుడు కన్నడ సినిమాలు ఇతర బాషా చిత్రాలకు భయపడి విడుదల చెయ్యడానికే భయపడేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కన్నడ సినిమాలకు బాలీవుడ్ తో సహా వివిధ భాషల సినిమాలు విడుదల చెయ్యడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని కన్నడిగులు నిర్మించి ఇటీవల విడుదల చేసిన…

National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత,…

TELANGANA

సోనియా తెలంగాణ నుంచే పోటీ: బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలంటూ రేవంత్ ఫైర్, ఇక ఊరుకోవద్దు!

హైదరాబాద్: ప్రతిపాక్ష పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi)ని పోటీ చేయాలని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం చేశారు. దీంతో పాటు మరో రెండు తీర్మానాలను ఈ సమావేశంలో సీఎం ప్రతిపాదించారు. మొదటి తీర్మానంగా ఏఐసీసీ తెలంగాణ…

TELANGANA

బీజేపీకి షాక్: హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన బాబు మోహన్ తనయుడు

హైదరాబాద్: అందోల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని…

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం-అదనంగా మరో 4368 ఈవీఎంలకు ఆర్డర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరో 9 రోజుల్లో ప్రచారం కూడా పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అదే సమయంలో ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈసీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న జరిగే తెలంగాణ…

TELANGANA

ఆ ఒక్క కారణం చాలదా?: పార్టీ మార్పుపై విమర్శలకు విజయశాంతి కౌంటర్

హైదరాబాద్: పార్టీ మారారంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయశాంతి. ఇటీవల విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె వెల్లడించారు. ‘రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్…

National

టీమిండియాకు నారా లోకేష్ ఓదార్పు-అలా సెలబ్రేట్ చేసుకుందాం..

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియలో ఇవాళ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ కు చేరిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం కంగారూల ప్రొఫెషనల్ ఆటతీరు ముందు చేతులెత్తేసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన లక్షమంది ప్రేక్షకులతో పాటు వందకోట్లకు పైగా భారతీయులు షాక్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియాకు…

TELANGANA

అవినీతి, కమీషన్లు: బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడిన జేపీ నడ్డా

హైదరాబాద్: కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నారని…