వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: షెల్టర్లకు తరలించాలి, ప్రభుత్వ ప్రాంగణాలు రక్షించాలి
దేశవ్యాప్తంగా వీధి కుక్కల కాట్ల కేసులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా రవాణా కేంద్రాల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స (Sterilization) చేయించి, వ్యాక్సిన్ వేయించాలని కోర్టు ఆదేశించింది. అయితే, శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో…

