కృష్ణా జలాలపై చంద్రబాబుకు జగన్ ఘాటు లేఖ: “ఇదే మంచి అవకాశం.. లేకపోతే అన్యాయమే”
కృష్ణా నదీజలాల పంపిణీ వివాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (KWDT-II) ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా బలమైన వాదనలు వినిపించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే, ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం…

