పాత, కొత్త కలయిక.. ఆసియా కప్ కోసం టీమిండియా ఇదే.. ఆ ఇద్దరి ఎంపిక షాకింగ్
ఈసారి బీసీసీఐ జాగ్రత్త పడింది. పాకిస్తాన్ తో ఫైట్ కోసం పటిష్టమైన జట్టునే తీసుకుంది. కొద్దికాలంగా 4వ స్థానంలో ఫినిషర్ లేకపోవడంతో అన్ని వైపులా విమర్శలు చుట్టుముట్టాయి. అందుకే ఆ స్థానంలో ఇటీవల విండీస్ టూర్ లో రాణించిన తిలక్ వర్మను తీసుకుంది. అయితే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫాంను బట్టి తిలక్ కు అవకాశం దక్కనుంది. ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది.…