LIC: LICలో 6.5% వాటా విక్రయం.. పాలసీదారులు, ఇన్వెస్టర్లపై ప్రభావం ఎలా ఉంటుంది?
దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LICలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ వాటా తగ్గడంతో పాటు మార్కెట్‌లో ప్రజల వాటా పెరగనుంది. దీంతో పాలసీదారులు, పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వం LICలో వాటాను ఎందుకు విక్రయించాల్సి వస్తోందంటే.. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల్లో కనీసం…

