CINEMA

12 రోజుల్లో 96 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ధమాకా’, 100 కోట్ల క్లబ్బులోకి

మాస్ మహరాజ్ రవితేజ తొలిసారిగా వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతున్నాడు. రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ 12 రోజుల్లో 96 కోట్లు వసూలు చేసింది. అయితే, ఇది కేవలం గ్రాస్ లెక్క. గ్రాస్ పరంగా చూసుకున్నాగానీ, రవితేజ సినిమాల్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘ధమాకా’ సరికొత్త రికార్డు సృష్టించినట్లయ్యింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా ‘ధమాకా’ సినిమా తెరకెక్కింది. ప్రధానంగా సినిమాలో పాటలు, అందునా శ్రీలీల గ్లామర్.. డాన్సులు..

మాస్ ఆడియన్స్‌ని థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. రిపీట్ ఆడియన్స్.. ఈ మధ్యకాలంలో ఇంతలా రిపీట్ ఆడియన్స్ మరే చిత్రానికీ రాలేదన్న చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ‘ధమాకా’ తోపాటుగా విడుదలైన ’18 పేజెస్’ కూడా మంచి టాక్ తెచ్చుకున్నా, అది కేవలం క్లాస్ ఆడియన్స్‌కే పరిమితమైంది. కాగా, 12 రోజుల్లో 96 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ధమాకా’, 100 కోట్ల క్లబ్బులోకి చేరడానికి కూతవేటు దూరంలోనే వుంది. మరోపక్క ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. రవితేజ పాత్ర తెరపై 40 నిమిసాల మేర కనిపిస్తోందట. అంటే, ఇంకోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ ధమాకా అన్నమాట.. ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో.!