AP

భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

తేదీ:6/1/2023.

భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ సభ ద్వారా రైతుల భూముల రికార్డులను పరిశీలించామని ఓ ప్రకటనలో ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర తెలిపారు.

ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద జరిగింది.

ఈ సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం, దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మీ భూమి మా హామీ భూ రక్ష పథకం ద్వారా భూముల రీసర్వే లో భాగంగా రైతులకు ఉన్నటువంటి భూముల రికార్డులు అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో అని రెవెన్యూ అధికారులు గ్రామ సభలో పరిశీలించారన్నారు.భూమికి సంబంధించిన యజమాని చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికెట్ మరియు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు ఏ విధంగా పొందాలో వీఆర్వో శివ వివరించారన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కలుం వెంకన్న దొర, ఇందుకూరుపేట మాజీ సొసైటీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర,గ్రామ పెద్దలు తుర్రం నూకన్న దొర,కలుం సూర్యప్రకాష్,మడకం వెంకటేష్ దొర,తుర్రం బోసు దొర,తుర్రం రమేష్ దొర,కొమర వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.