TELANGANA

బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు. 2014ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కేవలం పవన్ వలన బాబు సిఎం అయ్యారని జనసేన బ్యాచ్ ఆయన సిఎం గా ఉన్నంత కాలం చెప్పింది. అంతే కాదు , మోడీ ప్రధాని కావడానికి కూడా పవన్ మద్దతే కీలకం అని జనసేన ప్రచారం చేసుకుంది. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం ఏమిటో తెలిసింది. ఇప్పుడు టీడీపీ తో పొత్తు లేకపోతే జనసేన గుర్తింపు అసాధ్యమని భావించి చంద్రబాబుకు జనసేన దగ్గర అవుతుంది. అయితే, పవన్ , బాబు భేటి టీడీపీ కి ఇటీవల పెరిగిన గ్రాఫ్ ను దెబ్బతీసేలా ఉంది. వ్యూహాత్మకంగా బీజేపీ ఢిల్లీలో కదిలించిన కాపు రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు మెడకు పవన్ రూపంలో చుట్టుకో బోతున్నాయి. ఫలితంగా టీడీపీ బీసీ ఓటు బాంక్ కు ఈ సారి కూడా భారీ గండి పడనుంది. పవన్ వలన టీడీపీ కి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువని సర్వే ల సారాంశం. పైగా జనసేన పోటీ చేసే ప్రతి చోట బీ ఆర్ ఎస్ పోటీకి సిద్ధం అవుతుందని తెలుస్తుంది. కాపు కోటలను చీల్చడానికి కేసీఆర్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో పవన్ అప్రమత్తం అయ్యారు. టీడీపీ ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలని దూకుడు పెంచారు. అందుకే తాజా భేటి అంటూ ప్రత్యర్థులు లెక్కిస్తున్నారు. జనసేన కోరుకుంటున్న 15 నుంచి 20 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయడానికి సర్వేలు కూడా చేసినట్టు వినికిడి. ఏపీ రాజకీయం, సామాజిక వర్గాలను వేరువేరుగా చూడలేమనే విషయాన్ని గుర్తెరిగిన కేసీఆర్ కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌కు ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. జగన్ ప్రోద్భలంతోనే బీఆర్‌ఎస్ ఏపీలో రాజకీయం మొదలుపెట్టిందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఏపీలో బీఆర్‌ఎస్ రాజకీయానికి సంబంధించి తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతుందట. Also Read: Pawan Kalyan meets Chandrababu: ఏపీలో అరాచక పాలన.. భేటీ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు.! ఏపీలో మొత్తం 20 స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయిందని టాక్ నడుస్తోంది. వీటిల్లో మెజార్టీ స్థానాలు అసెంబ్లీ సీట్లు కాగా, రెండుమూడు లోక్‌సభ స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపాలని బీఆర్‌ఎస్ భావిస్తుందని తెలిసింది. మరీ ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపితే గెలిచినా, ఓడినా రాజకీయంగా ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనేది కేసీఆర్ స్ట్రాటజీగా తెలుస్తోంది. ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలనే విషయమై బీఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందట. ఈ మేరకు ఏపీలోని కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఒక సర్వే కూడా నిర్వహించిందని టాక్. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నయంగా బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎంచుకునే అవకాశం ఉందా ?, బీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ? తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాల పట్ల ఏపీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వంటి ప్రశ్నలను ఆ సర్వే బృందం ప్రజలను అడిగారట. ఈ తరహా సర్వేలే గత నెల కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ చేయించిందని తెలిసింది. ఏపీలో బీఆర్‌ఎస్ పోటీ చేయాలని భావిస్తున్న జిల్లాల విషయానికొస్తే.. సరిహద్దు జిల్లాలే ప్రధానంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను నిలపనుంది. గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, కృష్ణ జిల్లాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయనున్నట్లు తెలిసింది.జగ్గయ్యపేట, నందిగామ ఈ రెండు నియోజకవర్గాలు తెలంగాణలోని కోదాడకు దగ్గరగా ఉంటాయి. గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని కేసీఆర్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. Also Read: Thick Fog Covers North India: ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. ఆలస్యంగా రైళ్లు, విమానాలు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఏపీలోని కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గుంటూరు-2 నుంచి పోటీ చేయాలని, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నిలపాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. గుంటూరు, విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కూడా కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ వంటి వారిని కూడా బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఫిక్స్ అయి ఆ దిశగా వడివడిగా అడుగులేస్తుందనే విషయం మాత్రం స్పష్టమైంది.