పార్వతీపురం : “యువ శక్తి” కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర ప్రచారకర్త తాడి. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామంలో మండల అధ్యక్షరాలు ఆగూరు.మణి ఆధ్వర్యంలో “యువ శక్తి కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తాడి. మోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువత వలసల నిర్మూలనకు, వారి భవిష్యత్తుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశారని తెలిపారు. అందులో భాగంగా జనవరి 12న శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలోని యువశక్తి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున యువత, రైతులు, కార్మికులు అంతా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యువ శక్తి”పోస్టర్ ను ఆవిష్కరించి జై జనసేన.. జై యువశక్తి…చలోరణస్థలం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయుకుల రాజాన బాలు, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రేడ్డి గౌరీశంకర్,కర్రీ మణి ,ప్రదీప్,పవన్, ధీనెంద్రా,కేశవ, అప్పలరాజు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటి సభ్యులు చిట్లు.గణేశ్వర రావు , వీర మహిళ గోవిందమ్మ, అల్లు. రమేష్, గార గౌరిశంకర్ , సీతానగరం, బలిజిపేట మండల అధ్యక్షులు పాల్గొన్నారు.