: టిక్ టాక్,డబ్ స్మాష్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది అషూ రెడ్డి. ఇక అషూ రెడ్డి అచ్చం జూనియర్ సమంత లా ఉంటుంది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షో లో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ (Biggboss) షో కి వెళ్ళాక ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. హౌస్ నుండి బయటికి వచ్చాక ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కొన్ని ఈవెంట్లకు యాంకర్ గా అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా అషూ రెడ్డి (Ashu Reddy) కి అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కూర కారుకు పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూ చివర్లో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) అషూ రెడ్డి కాలి వేళ్ళను నోట్లో పెట్టుకోవడం సంచలనం సృష్టించింది.కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో చాలామంది అషూ రెడ్డిని విమర్శించారు. అయితే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అషూ రెడ్డి (Ashu Reddy) తల్లి ఆమెకు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిది అని భావిస్తుందట.ఇక ఈ నేపద్యంలోనే ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిందట. అయితే అషూ రెడ్డి (Ashu Reddy) తో కలిసి షార్ట్ ఫిలిమ్స్ లో చేసే, డబ్స్మాష్ వీడియోలలో చేసే ఒక యూట్యూబర్ ని అషూ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి భావిస్తుందట. అయితే ఆ యూట్యూబర్ అషు రెడ్డి తల్లికి కూడా చాలా నచ్చాడట. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని తన అమ్మాయికి ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే ఆమె జీవితం బాగుపడుతుందని ఇలాంటివన్నీ మానేసి బుద్ధిగా మారిపోతుందని అషూ రెడ్డి తల్లి భావిస్తుందట. ఇక ఈ విషయంలో ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.