TELANGANA

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

కోడి కత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.

బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. జనవరి 31 నుంచి కోడికత్తి కేసు విచారణకు షెడ్యూల్ ప్రకటించింది. లో పాదయాత్ర చేసుకుని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆ సందర్భంగా జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ పై కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. విశాఖలో ప్రథమ చికిత్స చేయించుకుని .. హైదరాబాద్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించారు. అప్పటి నుంచి ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేస్తోంది. నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగా జైల్లో కొనసాగుతున్నాడు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లారు. బెయిల్ పిటిషన్ కోసం జగన్ నుంచి ఎన్వోసీ తీసుకున్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోడికత్తి కేసులో బాధితుడు ఇప్పటి వరకు కోర్టుకు రాకపోవడం పై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు టేప్ రికార్డర్ లా వ్యవహరించబోదని తేల్చి చెప్పింది. కేసులో బాధితుడిని ఇంత వరకు ఎందుకు విచారించలేదని నిందితుడు తరపు న్యాయవాది సలీమ్ ఎన్ఐఏ ను ప్రశ్నించారు. స్టేట్ మెంట్ రికార్డు చేశామని ఎన్ఐఏ న్యాయవాది సమాధానం ఇచ్చారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తే చార్జిషీట్ లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా సాక్ష్యుల్ని విచారిస్తే ఏం లాభం ఉంటుందని న్యాయమూర్తి ప్రశ్నించారు.