AP

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం. పెద్దశాఖ పంచాయతీ జల గ్రామం

 

నాడు నేడు స్కూళ్ల పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి కొన్ని స్కూళ్లలో నాడు నేడు పనులు కోసం ఉపాధ్యాయులే కాంట్రాక్ట్ అవతారం ఎత్తి లక్షల రూపాయలు బిల్లులు సకాలంలో నేటికీ అందకపోవడంతో ఉపాధ్యాయులే ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తే పరిస్థితికి దారితీసింది : ఎప్పుడు బిల్లులవుతాయి ఇంకా ఎప్పుడు స్కూలు నేడు నాడు పనులు పూర్తి అవుతాయి అంటూ లబోదిబోమని ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు ఇంకా గిరిజన గ్రామాల్లో శిథిలావస్థలో స్కూల్ ఉన్నప్పటికీ నాడు నేడు పనులు ప్రారంభించిన పరిస్థితి మౌలిక వసతులు కూడా కల్పించిన పరిస్థితి ఇప్పటికైనా నాడు నేడు పనులకు సంబంధించి బిల్లులు సకాలంలో విడుదల చేయాలని అలాగే గిరిజన గ్రామాల్లో ఉన్న శిధిలావస్థలో స్కూళ్లలో కొత్త బిల్డింగులు నిర్మించి గిరిజన విద్యార్థులకు విద్య అందించాలని కోరుతున్నాం జల గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న రేకుల చెడ్డలో గిరిజన పిల్లలకి విద్య. గాలి వచ్చినా వానొచ్చిన ఆరోజు సెలవు ఏ నిమిషానికి ఏమైపోతారో అని విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరుతో స్కూల్ లన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో స్కూల్ కి మౌలిక వసతులు లేక పాడైపోయిన రేకుల చెడ్డలలో గిరిజన విద్యార్థులకు విద్య అందించే పరిస్థితి అలాగే నాడు నేడు పనులు చేసినప్పుడు కూడా సకాలంలో బిల్లులు అందక ఉపాధ్యాయులే చేతులెత్తిన పరిస్థితి. ఇలా అయితే గిరిజన విద్యార్థులకు భరోసా ఎక్కడ ఉంటుందని ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బిడ్డలకు ఇస్తున్న భరోసా కావున వెంటనే రేకుల చెడ్డను మినహాయించి నాడు నేడు పథకం కింద కొత్త స్కూల్ బిల్డింగ్ ఇచ్చి కొమరాడ మండలం పెద్ద శాఖ పంచాయతీ జల గ్రామంలో ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 20 మంది విద్యార్థులు చదువుతున్నారని ఇక్కడ కేవలం ఒకే టీచర్ మాత్రమే ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువు చెప్పే పరిస్థితి ఉంది అయితే ఈ గ్రామంలో రేకలు చెడ్డ నుండి గిరిజన విద్యార్థులకు విద్య అందించే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో ఒకవేళ గాలులు వచ్చినా వాన వచ్చిన ఆ రోజంతా సెలవే పిల్లలు ఇంటి వద్దకు వెళ్లి ఆడుకునే పరిస్థితి ఉందని మరి కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇలా గిరిజన గ్రామాల్లో స్కూలుకు మౌలిక వసతులు లేక రేకు చెడ్డలలో పిల్లలకు విద్య నిర్వహించే పరిస్థితి ఉందని ఒకవేళ ఏదైనా సందర్భంలో జరగరాని సంఘటన ఈ గిరిజన విద్యార్థులకు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కావున వెంటనే రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ జల గ్రామానికి కొత్త స్కూలు బిల్డింగ్ మంజూరు చేసి గిరిజన విద్యార్థులు అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాం. ఈ కార్యక్రమంలో రాము జమలయ్య ప్రకాష్ పాల్గొన్నారు