CINEMA

జూనియర్‌ ఎన్టీఆర్‌ నన్ను నిండా ముంచేశాడు.. ప్రొడ్యూసర్‌ సంచలన ఆరోపణలు..!

ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్ ఏ రేంజ్‌ లో ఉందో అందరికీ తెలుసు. అలాగే ప్రభాస్ రేంజ్‌ అంతకు మించి ఉంది. వీరిద్దరూ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరిద్దరూ కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఉన్నప్పుడు వారితో సినిమాలు చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో నైజాంలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్‌కు వర్షం సినిమాతో మంచి హిట్ పడిన తర్వాత ఆయనతో సినిమా చేయాలని భావించాను. నేను అప్పటికే నైజాంలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్నాను. నా బ్యానర్‌ లో సినిమా చేయాలని కోరేందుకు ప్రభాస్ ఇంటికి వెళ్లాను.

గిట్టని వాళ్ల కారణంగా.. ఆయన తండ్రి సూర్యనారాయణ రావు సమక్షంలో సినిమా చేసేందుకు మాట తీసుకున్నాను. కానీ అది మంచి రోజు కాకపోవడంతో అడ్వాన్స్‌ తర్వాత తీసుకుంటామని వారు చెప్పారు. దాంతో నేను ఇంటికి వచ్చాను. కానీ నేనంటే గిట్టని కొందరు డిస్ట్రిబ్యూటర్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో ప్రభాస్‌కు ఫోన్ చేయించారు. ఆవుల గిరితో సినిమా చేయొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రభాస్‌కు చెప్పాడు. దాంతో వారు నాతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపించలేదు. నాకు తారక్‌ ఫోన్‌ చేశాడనే విషయాన్ని తర్వాత వేరే వారి ద్వారా తెలిసింది. అలా నా బ్యానర్‌ లో ప్రభాస్‌ సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయాను. ఒకవేళ ప్రభాస్‌ తో సినిమా చేసే ఆఫర్‌ వస్తే నేను ఇప్పటికి మంచి ప్రొడ్యూసర్‌ గా ఉండేవాన్ని అంటూ చెప్పుకొచ్చాడు ఆవుల గిరి.