CINEMA

సంక్రాంతి రేసులోకి ‘ప్రాజెక్ట్-కె’.’ తొందరేల ప్రభాసూ.!

వచ్చే సంక్రాంతికి ‘ప్రాజెక్ట్-కె’ సినిమా విడుదల కాబోతోందిట. ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ, ‘ఆదిపురుష్’ సంగతేంటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. ‘త్వరలో వచ్చేస్తుంది..’ అని ‘ఆదిపురుష్’ టీమ్ అంటోంది. కానీ, అదెక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ సంక్రాంతికే ‘ఆదిపురుష్’ వచ్చేయాల్సింది. కానీ, రాలేదు. సో, ‘ప్రాజెక్ట్-కె’ విషయంలో రిలీజ్ డేట్ (12 జనవరి 2023) అంటూ ప్రకటించడం ఒకింత అత్యుత్సాహమే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. దీపికా పడుకొనే ఈ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ‘ప్రాజెక్ట్-కె’ అనౌన్సమెంట్ ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపలేదు. బోల్డన్ని డౌట్స్‌కి కారణమయ్యింది. రెండు లేదా అంతకు మించిన సంఖ్యలో భాగాలుంటాయన్నది ‘ప్రాజెక్ట్-కె’ గురించి జరుగుతున్న ప్రచారం. ఈ వ్యవహారంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతికి వచ్చేది మొదటి పార్ట్ అనుకోవచ్చా.? ఏమో, అలాగే అనుకోవాలేమో.! ఈ ప్రకటనతో, సంక్రాంతికి ఆశలు పెట్టుకున్న ఇతర పెద్ద సినిమాల్ని అయోమయంలోకి నెట్టేసినట్లుంది.!