APTELANGANA

ఎమ్మెల్యే అవినీతి బాగోతం ప్రతివారం సీరియల్ గా విడుదల చేస్తా జ్యోతులనెహ్రూ

 

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన 15, 16 తేదీలలో సవ్యంగా సాగింది. ఆ పర్యటనకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక పోలీసులు సహాయంతో పర్యటన అడ్డుకోవడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు
నీదర్శనమని అన్నారు. కొద్ది మందిపైనే కేసులు పెట్టడం కాదు వేలాదిమంది ఆ పర్యటనకు వచ్చారని ఈ ప్రభుత్వనికీ నిజంగా దమ్ముంటే అందరిమీద కేసులు పెట్టండని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒక పత్రిక సమావేశం నిర్వహించి నన్ను జగ్గంపేట సీటు ప్రకటించుకోమని అన్నాడని కానీ అప్పటికే చంద్రబాబు ప్రజల సమక్షంలో నాకు జగ్గంపేట సీటు ప్రకటించారని నీ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు అని జ్యోతులు చంటిబాబును పరోక్షంగా విమర్శించారు. జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ కు మీ పార్టీ తరఫున అనేకమంది పోటీ పడుతున్నారని ముందు నువ్వు టిక్కెట్ కోసం చూసుకో అని ఆయన అన్నారు. 1991 లో నేను సొసైటీ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని అప్పుడు నాకు టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కానీఆ పదవి జ్యోతుల రామస్వామికి ఇచ్చామని ఆ సొసైటీ పదవి అడ్డుపెట్టుకుని 54 ఎకరాలు భూములు కొన్నాడని 90 లక్షల రూపాయలు గోల్ మాల్ చేశాడని అన్నారు. బినామీ పేర్లతో మామిడాడ సొసైటీలో లోన్లు తెచ్చాడని ఇప్పటికే అనేకమంది తమ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారని తెలియజేశారు. ఇంకా జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు గండే పల్లి మండలం రామేశ్వరం పేట లో గల గుల్లమెట్ట కొండను 154 ఎకరాల ఎర్ర మట్టి తోలుకుని ఎకరాకు పది లక్షలు చొప్పున ఆయన అనుచరుగణం దోచుకున్నారని వీటిపై నీకు దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు నువ్వు ముఖాముఖి చర్చకి వస్తానని డిమాండ్ చేసావ్ దానికి కూడా నేను సిద్ధమేని జ్యోతుల నెహ్రూ సవాలు చేశారు. ఇదే విధంగా ప్రతి వారం ఎమ్మెల్యే అవినీతిపై సీరియల్ గా మీడియా ముందుకు వస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కోర్పు సాయి తేజ, అడపా భరత్ కుమార్,చదరం చంటిబాబు, కన్నబాబు, మంగ రౌతు రామకృష్ణ, జీను మణి బాబు, వీరం రెడ్డి కాశి బాబు, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, జంపన సీతారామచంద్ర వర్మ, పిలా మహేష్, తదితరులు పాల్గొన్నారు.