National

ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడి

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శివపాల్‌ యాదవ్‌, తన పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న చౌదరి చరణ్‌ సింగ్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఆ ఆందోళనను కవర్‌ చేయకుండా మార్షల్స్‌ అడ్డుకునాురు. జరులిస్టులు, కెమెరామెన్లపై దాడికి దిగారు. మార్షల్స్‌ విధి నిర్వహణ అసెంబ్లీకే పరిమితం. వారు అసెంబ్లీలో మాత్రమే విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రాంతాలు పోలీసుల ఆధీనంలో ఉంటాయి. అయినా జరులిస్టులపై దాడి చేయడానికి మార్షల్స్‌ అసెంబ్లీ లోపల నుంచి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విధానసభ వద్ద జర్నలిస్టులు, కెమెరామెన్లపై మార్షల్స్‌ దాడిని ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే మార్షల్స్‌ ఈ దాడి చేశారని, అందుకు తగిన వీడియో ఆధారాలు ఉన్నాయని డియుజె తెలిపింది. యుపిలోని యోగి ఆధిత్యనాధ్‌ ప్రభుత్వం అక్రమాలు, దుర్మార్గాలను వెల్లడిస్తును జరులిస్టులపై వివిధ ఏజెన్సీలు ప్రతీకార దాడులు, విచారణలు, అరెస్టులకు పాల్పడుతునాుయని డియుజె విమర్శించింది. తాజాగా మీడియా ప్రతినిధులపై జరిగిన భౌతిక దాడిపై డియుజె దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన మార్షల్స్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది.