AP

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జనరల్ టికెట్ తీసుకొని, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు అదే టికెట్‌పై స్లీపర్ కోచ్‌లో జర్నీ చేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) ఈ వెసులుబాటు లభిస్తుంది. సాధారణంగా భారతదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. పండుగ వేళల్లో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులు కూర్చోవడానికి కూడా చోటు ఉండదు. స్లీపర్ కోచ్‌లల్లో మాత్రమే బెర్తులు ఖాళీగా కనిపిస్తుంటాయి. ఇలా ఖాళీగా ఉన్న బెర్తుల్ని వాడుకోవాలని భారతీయ రైల్వే భావిస్తోంది.

స్లీపర్ కోచ్‌లో బెర్తులు ఖాళీగా ఉన్నప్పుడు, రద్దీగా ఉన్న జనరల్ బోగీ నుంచి కొందరు ప్రయాణికుల్ని స్లీపర్ బెర్తులోకి మార్చవచ్చు కదా అన్న ఆలోచన ప్రయాణికుల్లో రావడం మామూలే. ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం ఇది సాధ్యం కాదు. అందుకే భారతీయ రైల్వే ఈ నిబంధనల్ని కాస్త సవరిస్తోంది. స్లీపర్ కోచ్‌లల్లో బెర్తులు మిగిలితే, వాటిని జనరల్ కేటగిరీ ప్రయాణికులకు కేటాయించాలని భారతీయ రైల్వే భావిస్తోంది.

Account Balance: అకౌంట్‌లో డబ్బులు లేవా? అయినా రూ.10,000 డ్రా చేయొచ్చు

స్లీపర్ కోచుల్లో 80శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైళ్ల వివరాలను భారతీయ రైల్వే సేకరించింది. జనరల్ బోగీల్లో రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి జనరల్ బోగీల్లోని కొందరు ప్రయాణికుల్ని ఖాళీగా ఉన్న స్లీపర్ బెర్తుల్లోకి అనుమతిస్తారు.

ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు స్లీపర్ కోచుల్లో ప్రయాణించడానికి వీలు లేదు. స్లీపర్ కోచుల్లో ఖాళీ బెర్తులు ఉన్నా వాటిలోకి వెళ్లకూడదు. ఒకవేళ అలా ప్రయాణం చేస్తే ప్రయాణికులు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు ఆ సమస్య ఉండదు. రైల్వే శాఖనే జనరల్ టికెట్ ప్రయాణికులను స్లీపర్ కోచుల్లోకి అనుమతిస్తోంది.

శీతాకాలం, వేసవికాలంలో రైల్వే ప్రయాణికులు స్లీపర్ కోచ్‌ల బదులు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తుల్ని ఎక్కువగా బుక్ చేస్తున్నారు. దీంతో స్లీపర్ కోచుల్లో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. అందుకే స్లీపర్ కోచ్‌లల్లో రిజర్వ్ కాని బెర్తుల్ని జనరల్ టికెట్ తీసుకున్నవారికి కేటాయిస్తోంది భారతీయ రైల్వే. అంటే జనరల్ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు స్లీపర్ కోచుల్లో ప్రయాణించే అనుభూతిని పొందొచ్చు. అయితే జనరల్ టికెట్ ఉన్న రైల్వే ప్రయాణికులు టీటీఈ అనుమతితో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది.

Aadhaar Card:
ఆధార్ కార్డ్ ఉన్నవారికి UIDAI అలర్ట్… ఈ వివరాలు అప్‌డేట్ చేయాలని సూచన

ఈ చిన్న మార్పు ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, రైల్వేకు ఆక్యుపెన్సీ సమస్య తీరుతుంది. అయితే ప్రస్తుతం ఈ వెసులుబాటు అన్ని రైల్వే జోన్లలో లేదు. భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా కొన్ని రైల్వే జోన్లలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని ప్రధాన రైళ్లల్లో ఈ వెసులుబాటు కల్పించినట్టు ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే తెలిపింది.