TELANGANA

డీజే సౌండ్ దెబ్బకు పెళ్లిమండపంలోనే వరుడు మృతి

పెళ్లి(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు.

అందుకే పెళ్లి కార్డు మొదలు.. ఊరేగింపు వరకు.. అన్నింటా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి.. ఆ మధుర క్షణాలను ఎంతో సంతోషంగా.. ఉత్సాహంగా ఆస్వాదిస్తారు. ఐతే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బీహార్‌లో(Bihar) కూడా ఇలాంటి షాకింగ్ ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి వేడుకలో వరుడు DJ సంగీతం హోరుకి కుప్పకూలి మరణించాడు.

బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో మణితార గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంత యువతితో ఇందర్వాలో పెళ్లి జరుగుతోంది. దంపతులు దండలు మార్చుకుని ఇతర పూజలు చేశారు. సురేంద్ర తన పెళ్లి ఊరేగింపులో ప్లే అవుతున్న DJ యొక్క శబ్దం గురించి పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. వివాహానికి వచ్చిన యువకులు డీజే సౌండ్ విపరీతంగా పెట్టి డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తుండగా వేదికపై పెళ్లికొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారు పడ్డ కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మెదక్ ఆర్డినెన్స్ లో 438 ఉద్యోగాలు .. “>

Crime News: తండ్రి కాదు..రాక్షసుడు..కన్న కూతుర్ని గొంతు నులిమి..

కానీ అప్పటికే సురేంద్రకుమార్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. డీజే సౌండ్ ఎక్కువ అవడం వల్లే సురేంద్ర గుండె ఆగినట్లు డాక్టర్లు తెలిపారు. అప్పటి వరకు తమతో పాటు ఆడిపాడిన సురేంద్ర.. మరణించడమేంటని శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ ఘటన జరగడంతో వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా,గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.