CINEMA

కేజీఎఫ్‌ రేంజ్ లో ఉపేంద్ర కబ్జా మూవీ…

కేజీఎఫ్  సినీ ప్రేక్షకుడికి ఈ సినిమా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కన్నడలో విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో కన్నడ చిత్ర పరిశ్రమ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. కేజీఎఫ్‌ తర్వాత వచ్చిన కాంతార సైతం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్‌ చిత్రాన్ని మైమరపించే స్థాయిలో కన్నడ ఇండస్ట్రీని నుంచి మరో మూవీ వచ్చేస్తోంది.. అదే కబ్జ. ఉపేంద్ర హీరోగా ఆర్‌. చంద్రు దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ను చూస్తున్నంతసేపు కేజీఎఫ్‌ మూవీ గుర్తుకురావడం ఖాయం. అయితే కథనం కేజీఎఫ్‌లాగే ఉన్నా కథ మాత్రం పూర్తిగా వైవిధ్యంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమా టీజర్, పోస్టర్లు, సెట్స్, బ్యాక్ గ్రౌండ్ అంతా కేజీఎఫ్‌ను గుర్తుచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే మేకర్స్‌ ఎక్కడా సినిమా కథను రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. పోలీస్‌ ఆఫీసర్‌గా ఉన్న ఉపేంద్ర మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడన్న కథాంశంతో సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. కోట శ్రీనివాసరావు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ ఈ సినిమాపై చిత్ర యూనిట్ అంచనాలు పెంచేసింది. ఇక ‘ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు.. ఆ కత్తిని పట్టుకున్న బలమైన చేతితో సాధ్యం’ అని వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది.