CINEMA

కెజిఎఫ్ ను చిల్లారగాడు, నీచ్ కమీనే కుత్తే అంటున్న కంచరపాలెం డైరెక్టర్…

ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా ఒక ఎంటర్ టైనర్. నచ్చింది.. నచ్చలేదు అని చెప్పడం ఒక ప్రేక్షకుడు ఇష్టం. కానీ, ఆ సినిమాను, సినిమా తీసినవారిని కించపర్చేలా మాట్లాడడం మాత్రం గౌరవించదగ్గ విషయం కాదు. అందులోనూ ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ తీసిన సినిమాపై ఇలాంటి ఘాటు ఆరోపణలు చేయడం అంటే ఆయన పరువే కాదు టాలీవుడ్ పరువును కూడా తీసినట్టే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఏంటి ఇదంతా అంటే.. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి ఫ్యాషనేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. మొదటి సినిమానే మంచి గుర్తింపు రావడంతో వెంకటేష్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఇక ఈ సినిమా తరువాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే రీమేక్ చేసి మెప్పించాడు.. ఈ మధ్యనే నటుడిగా కూడా మారిన ఇతగాడు కొద్దిగా నోరు జారాడు.

గతేడాది రిలీజ్ అయిన సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కెజిఎఫ్ చిత్రంపైనే సంచలన కామెంట్స్ చేశాడు. మరీ చిల్లరగా వాడు, వీడు అని, నీచ్ కమీనే కుత్తే అని తిట్టిపోశాడు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెగలు రేపుతున్నాయి. కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి కోసం ఒక కొడుకు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి.. చివరికి ఆమె కోరుకున్న విధంగా ఎదుగుతాడు. ఈ సినిమా అందరిని మంత్రముగ్దులను చేసింది. అలాంటి సినిమాను ఒక పాప్ కార్న్ సినిమా అని.. ఆ నీచ్ కమీనే కుత్తే గాడు తీసిన సినిమాకు జనాలు చప్పట్లు కొడుతున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు వెంకటేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నువ్వు తీసిన రెండు సినిమాలకు ఎందుకు నీకు అంత పొగరు.. సినిమా తీయడం తెలుసా నీకు.. అది ఒక సినిమా.. నచ్చితే నచ్చిందని చెప్పు.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు.. అంతేకానీ ఈ విధంగా మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది. ఆ సినిమా తీసి అతడు నీచ్ కమీనే కుత్తే అయితే.. వారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావ్ మరి నిన్నేం అనాలి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్ సెగ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.