ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ)ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో నగర కోశాధికారి మావూరి విజయ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.
ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ న్యాయమూర్తి అడబాల లక్ష్మి మహిళా ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను సాధించుకునేందుకు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని, తమ కోసం నిర్దేశించబడిన చట్టాలను అవగాహన చేసుకోవాలని, తద్వారానే లింగ వివక్షత, సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను రూపుమాపేందుకు, మహిళలు మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినప్పటికి
అది కేవలం ప్రభుత్వ శాఖలలో మహిళలు పనిచేసే చోట, కాలేజీలలో జరుగుతున్నాయి తప్ప, వాస్తవానికి మహిళా దినోత్సవం ఒకటుందని తెలియని మహిళలు మనదేశంలో ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేకించి భారతదేశంలో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి లింగ వివక్షత కారణంగా స్త్రీలని అణిచివేసేందుకు, మనుధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తూ బిజెపి,ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారశక్తులు స్త్రీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
మహిళా సమాఖ్య జిల్లా ఇంచార్జ్ ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ మహిళల పైన ఆధునికయుగంగా చెప్పబడుతున్న నేటి కాలంలో కూడా అత్యాచారాలు హత్యలు పెరిగిపోవడానికి కారణం మహిళలు తమ హక్కులను తమకున్న చట్టాలను తెలుసుకోకపోవడమే ఖచ్చితంగా మహిళలందరూ తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటాలే మార్గమని ఆ పోరాటాలను ముందుండి నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ)ఎల్లప్పుడూ ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.
(ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ)నగర కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై నిర్భయంగా శ్రామిక మహిళలు గళం విప్పాలని ఎన్నో పోరాటాల ద్వారా తమ హక్కులు సాధించుకున్న మహిళలు మరింత చైతన్యవంతంగా పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు..