APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరిది హర్యానా..మరొకరిది కర్ణాటక.

 

మొదట్లో ఒకటి, రెండు కేసులే వచ్చినా.. మెల్లిగా చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందీ మాయదారి రోగం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 90 మందిలో ఈ వైరస్ కేసులు నిర్ధారించారు. అదేవిధంగా ఎనిమిది H1N1 వైరస్‌ కేసులు కూడా నమోదయ్యాయి. సీజనల్‌ వ్యాధులకు సీజన్‌ కాదు..మండు టెండకు స్వాగతం పలికే సమయం..ఇలాంటి టైమ్‌లో ఫ్లూ జ్వరాలు దేశమంతటా పెరిగిపోతున్నాయి. అందులో H3N2 వైరస్‌ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా

 

రెండు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ హెచ్3 ఎన్2 రకం ఎఫెక్ట్‌ ఎక్కువ.. ఈ రోగం సోకితే దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే.