TELANGANA

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు.

రాష్ట్ర BJP అధ్యక్షులు. బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నాం. K.బ్రహ్మం.బీజేపీ జిల్లా నాయకులు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇట్టి అక్రమ అరెస్టులు అల్లాదుర్గం మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామ, లేదా రజాకార్ల నియంతృత్వ పాలనలో ఉన్నామ,అని అసహనం వ్యక్తం చేశారు .
దీనికి పూర్తి సీఎం కేసీఆర్ భాధ్యత వహించాలని, అన్ని పేపర్లు మీరే లీక్ చేసుకొని, కావాలనే నిందలు మోపడం కరెక్టు కాదు. ప్రభుత్వం మీ చేతిలో ఉందా, మా చేతిలో ఉందా ఈ లీకేజీ వ్యవహారాలకు బండి సంజయ్ గారికి ఎటువంటి సంబంధం లేదని, తెలంగాణ ప్రజానీకానికి తెలుసు.
ప్రభుత్వం వెంటనే బేశరత్తుగా విడుదల చేయాలని, లేనిపక్షంలో ఎక్కడికక్కడే ధర్నాలు రాస్తారోకోలు పెడతావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ నాయకులు, గడిపెద్దాపుర్ గ్రామ అధ్యక్షులు M. సాయిలు గౌడ్, ఉపాధ్యక్షులు కుమ్మరి మారుతి, మండల.ఉపాధ్యక్షులు సదానందం గౌడ్, ch ఆంజనేయులు, శ్రీకాంత్, మాణిక్ నాయక్, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.