AP

మాజీ ఎమ్మెల్యే భూమా జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

 

నంద్యాల తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల నియోజకవర్గం, నంద్యాల పట్టణంలోని వార్డులో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన టిడిపి భూమా అభిమానులు,కార్యక ర్తలు,నాయకులు, నంద్యాల పట్టణంలోని సంఘమిత్ర సేవా సమితిలో పిల్లలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసిసిన మంచాల భాస్కర్ రెడ్డి,సంపంగి రామకృష్ణ,37 వ వాడు టిడిపి ఇంచార్జ్ మంజుల వెంకట స్వామి ఆధ్వర్యంలో నందమూరి నగర్ లో ప్రజలు టిడిపి కార్యకర్తలతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపి కార్యకర్తలు వార్డు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో మంజుల వెంకటస్వామి, మంజుల వెంకట రమణ,బోయ రాముడు,దేవదాసు, మరాఠి సూరి,పటాన్ తదితర తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు,నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్,RTC బస్టాండ్, బైర్మల్ వీధి తదితర వ్యాపార ప్రాంతాలలో తక్కువ మైక్రాన్ లతో తయారైన ప్లాస్టిక్ కవర్లను పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో అందజేసి స్వీట్లు పంచిపెట్టారు, ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి పట్టణ అధ్యక్షుడు మనియర్ ఖలీల్, కౌన్సిలర్ నాగార్జున, మహబూబ్ అలీ,అయూబ్ భాష, ముద్దం నాగ నవీన్,భాషా,బుజ్జి, బాలు,హరి,బాబా,మధు,నాయుడు, చెన్నయ్య, మద్దికేర కైలాష్ తదితరు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా సంపూర్ణ మెజార్టీతో గెలిచి నంద్యాల నియోజక వర్గ ప్రజలకుతమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.