భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..? అసలు మన నీళ్లే మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ప్రజలు తాగే నీటి పరిశుద్ధతను లెక్కగట్టి ర్యాంకులు ఇచ్చింది యేల్ యూనివర్శిటీ.
ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) ర్యాంకుల ఆధారంగా ఏ దేశంలో ప్రజలు మంచినీరు తాగుతున్నారు, ఏ దేశ ప్రజలు మురికి నీరు తాగి అనారోగ్యాలబారిన పడుతున్నారని లిస్ట్ తయారు చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. 2022నాటికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందిస్తామన్న మన ప్రధాని మోదీ మాటలు ఎంత మోసమో మరోసారి గుర్తుకొస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలు తాగుతున్న నీటిపై యేల్ యూనివర్శిటీ పరిశోధన చేపట్టింది. అన్ని దేశాలనుంచి తాగునీటి శాంపిల్స్ ని సేకరించి విశ్లేషించింది. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాల్లోని ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారని తేల్చింది.