CINEMA

సమంతలో మరో కోణం.. హీరోయిన్ కాకముందే అంత పొగరు చూపించిందా?

సమంత(Samantha) అంటే తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. `ఏ మాయ చేసావే` సినిమాతో 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంటూ తనదైన టాలెంట్ తో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ హీరోలతో సమానంగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే సమంత సినిమాల్లోకి రావడానికి చాలా కష్టాలు పడిందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, ఆమెలో మరో కోణం ఉంది. హీరోయిన్ కాకముందే ఆమె చాలా పొగరు చూపించింది. తాజాగా సమంతపై డైరెక్టర్ శివ నాగేశ్వరరావు(director siva nageswara rao) చేసిన కామెంట్స్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నిజానికి సమంతను శివ నాగేశ్వరరావునే ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందట. సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసింది కూడా ఆయనే అట. ‘నిన్ను కలిసాక'(Ninnu Kalisaka) సినిమాకు సమంతను ఆడిషన్ చేసినట్టు శివ నాగేశ్వరరావు తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘సమంత అప్పుడు చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. `నిన్ను కలిసాక` మూవీ ఆడిషన్ కోసం ఆమెను హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆమె వచ్చింది.

ఆడిషన్ అయిపోయాక సమంత(Samantha)ను చెన్నై పంపుదామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు కాస్త తక్కువగా ఉన్నాయి. దీంతో ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని అడిగితే.. తాను ఉండనని తెగేసి చెప్పింది. చేసేదేమీ లేక బోలెడన్ని డబ్బులు పోసి టికెట్ బుక్ చేసి ఆమెను అదే రోజు చెన్నై పంపించింది. అలాగే ఆమె ఆడిషన్ నచ్చి హీరోయిన్ పాత్రకు సంప్రదించగా.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. దాంతో మరో హీరోయిన్ ను తీసుకున్నాము` అని తెలిపారు. మొత్తానికి హీరోయిన్ కాకముందే సమంత చాలా పొగరు చూపించిందని ఆయన పరోక్షంగా కుండబద్దలు కొట్టేశారు.