తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం పార్టీ అమలుచేసిన పథకాలు.. చేపట్టిన కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశమేనని గుర్తుచేశారు చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్లకు రూపాయి ఖర్చుపెట్టలేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూపాయి కేటాయించలేదన్నా. అమ్మఒడి నాన్నబుడ్డిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దళితులకోసం ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం అమలు చేసింది లేదన్నారు.
‘దళితులకు పథకాలు, సంక్షేమమే కాకుండా ఎస్సీలను వ్యక్తిగతంగా ప్రోత్సహించాము . బాలయోగిని తొలిసారి లోక్ సభ స్పీకర్‌ను చేశాం. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. అంబేద్కర్ విదేశీ విద్య పథకం అమలు చేసి 440 మంది దళిత యువతీ యువకులను విదేశాలకు పంపించాము. నేను అంబేద్కర్ పేరుపెడితే.. అది తీసేసి జగనన్న అని పెట్టా రు. నాలుగేళ్లలో కేవలం 10 మందికి డబ్బులిచ్చి పేరు మార్చాడు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్మృతివనం ఏర్పాటుకు బీజం వేస్తే దాన్నిఆపేశారు. అంబేద్కర్ విగ్రహంతోపాటు, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాం పెట్టాలనుకున్నాం..