Technology

అంత సంపాదిస్తున్నా సుందర్ పిచాయ్ పై విమర్శలు అందుకే

సుందర్ పిచాయ్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. 2022 సంవత్సరానికి పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్ల పారితోషికం అందించింది.

 

Sundar Pichai Salary: అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన సంపాదన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా రూ. 1800 కోట్ల సంపాదనతో అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. అంత భారీ పారితోషికం తీసుకోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. సంస్థలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నా సుందర్ పిచాయ్ కి అంతలా వేతనం ఇవ్వడం ఏమిటనేది ప్రశ్నగానే మారింది.

సుందర్ పిచాయ్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. 2022 సంవత్సరానికి పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్ల పారితోషికం అందించింది. మన దేశ కరెన్సీలో అది రూ.1800 కోట్లుగా చెబుతున్నారు. కంపెనీ ఉద్యోగుల వేతనాలకు సీఈవో వేతనానికి భారీ తేడా ఉంటోంది. వారి సంపాదనకు సీఈవో ఆదాయానికి 800 రెట్లు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగుల్లో అసహనం నెలకొంది.

మార్చిలో గూగుల్ ఉద్యోగులు చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. తమ వేతనాలు ఇంత తక్కువగా ఉంటే సీఈవో వేతనం ఇంత భారీగా ఉండటంతో అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు సీఈవో వేతనం చర్చనీయాంశం అయింది. స్టాక్ అవార్డు కారణంగా పిచాయ్ పారితోషికం వెలుగులోకి వచ్చింది.

సుందర్ పిచాయ్ జీతం 21.8 మిలియన్ డాలర్లు అంటే రూ. 1788 కోట్లుగా ఉంది. గత ఏడాది ఆయన వేతనం 6.3 మిలియన్ డాలర్లు కావడంతో గత మూడేళ్లలో 2 మిలియన్ డాలర్లు పెరిగింది. సుందర్ పిచాయ్ కు 2019లో 28.1 మిలియన్ డాలర్ల ప్యాకేజీ లబించింది. దీంతో ఆయన పారితోషికం పెరుగుతుండటంతో గూగుల్ సంస్థ భారీగా ఇవ్వడంతో ఉద్యోగులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.