ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో ..
ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి. ఒక్క నటనలోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఔరా అనిపిస్తూ హృదయాలను కొల్లగొట్టి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించకపోయినా అమ్మడికి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుది కాదు. అయితే ఆ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతుందా..? అంటే.. నిజమే అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం కూడా చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. నేడు సాయి పల్లవి పుట్టినరోజు.. అయినా సోషల్ మీడియాలో హంగామా లేదు.