SPORTS

పాలిట మెయిన్ విలన్ ఇతడే.. చెత్త నిర్ణయాలతో టీంను బొంద పెట్టేశాడుగా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కథ దాదాపుగా ముగిసింది.

లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి.


ఈ సీజన్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అలా జరిగేందుకు ఉన్న ఆస్కారం 0.0000001 శాతం కంటే తక్కువ. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక పోరులో గెలిచే స్థితి నుంచి సన్ రైజర్స్ ఓడిపోయింది.


ఈ మ్యాచ్ లో ఒక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ సులభంగా గెలిచేలా కనిపింది. 15 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్.. 2 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఈ దశలో లక్నో విజయ సమీకరణం 30 బంతులకు 69 పరుగులుగా ఉంది.


అయితే ఇక్కడే సన్ రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ లెక్క తప్పాడు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన నటరాజన్ కు బౌలింగ్ ఇవ్వకుండా పార్ట్ టైమ్ బౌలర్ అభిషేక్ శర్మకు బంతిని ఇచ్చాడు.


దీని కోసమే కాచుకుని ఉన్న మార్కస్ స్టొయినిస్ 6, వైడ్, 6 బాదాడు. మూడో బంతికి మరో భారీ షాట్ కు వెళ్లి అవుటైయ్యాడు. ఇక చివరి మూడు బంతులకు పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ ను ఒకసారి చూస్తే.. 6, wd, 6, W, 6, 6, 6తో మొత్తంగా 31 పరుగులను లక్నో జట్టు సాధించింది.


దాంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఓడిపోయేలా కనిపించిన లక్నో ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. చెత్త కెప్టెన్సీతో మార్క్రమ్ సన్ రైజర్స్ ను ఓడించేశాడు. చేతిలో 8 వికెట్లు.. స్టొయినిస్, పూరన్ లాంటి పవర్ హిట్టర్లను పెట్టుకుని డెత్ ఓవర్స్ లో పార్ట్ టైమ్ బౌలర్ తో బౌలింగ్ చేయించడం అత్యంత చెత్త నిర్ణయం.