National

భారతీయ వంటకాలపై ఎలాన్ మస్క్..! క్షణాల్లో ట్వీట్ వైరల్

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేరిపోయారు.

దీంతో భారతీయ వంటకాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ట్విట్టర్లో (Twitter) ఎలాన్ మస్క్ ఫాలోవర్ ఒకరు భారతీయ వంటకాలను (Indian food) మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు. బటర్ చికెన్, నాన్, అన్నం ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ ‘నిజం’ అంటూ రిప్లై ఇచ్చారు.

క్షణాల్లోనే వైరల్ అయిన ఎలాన్ రిప్లైకి నాలుగున్నర గంటల్లో 20లక్షల మందికి పైగా వీక్షించారు. ఎలాన్ భారత్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఎలాన్ మీకు మంచి ఫుడ్ టేస్ట్ ఉంది, భారత్ వచ్చి ఇక్కడి అద్భుతమైన వంటకాలు టేస్ట్ చూడండి.. అని కామెంట్స్ పెట్టారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ వంటకాలను ఎలాన్ మస్క్ ప్రశంసించడంపై హర్షం వ్యక్తమవుతోంది. గతంలో కింగ్ చార్లెస్ 3, ప్రఖ్యాత గాయని లేడీ గాగా సైతం తమకు భారతీయ వంటకాలంటే ఇష్టమని చెప్పడం విశేషం.