TELANGANA

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ

తిరుమల/తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. ఆర్ టీసీ బస్సులు. సొంత కార్లలో తిరుమలకు వెళ్లి వస్తుంటారు.

వేలాది మంది భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు వాహనాల్లో సంచరించడానికి రెండు ఘాట్ రోడ్ లు ఉన్నాయి.

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చెయ్యాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, తిరుమలకు వచ్చి వెలుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

 

తిరుమలలోని ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలనా భవనంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ సీనియర్ అధికారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకున్నది.

డౌన్ ఘాట్ రోడ్డులో 1వ మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేట్, అప్ ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్ ఘాట్ రోడ్డులో లాగా డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.