పెద్దగా చదువుకోని వాళ్లు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయలేని వాళ్లు మాత్రమే ఫుట్‌పాత్(Footpath)పై చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి పొందుతుంటారు.
కాని ముంబై(Mumbai)లో ఇద్దరు యువకులు బాగా చదువుకున్నారు. ఒకరు ఎంబీఏ(MBA), మరొకరు బీటెక్(B.Tech) చేశారు. ఇంత చదివిన వాళ్లకు ఉద్యోగం కంటే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని ఆలోచించారు. అంతే ఆన్ డ్రైవ్ టీ(On Drive Tea) పేరుతో కొత్తగా స్టార్టప్ బిజినెస్(Startup business)ని ప్రారంభించారు. వీళ్ల వ్యాపారం ఏమిటంటే ఫుట్‌పాత్(రోడ్డు పక్కన) టీ అమ్ముకోవడం. ఇలా అమ్మితే వాళ్ల దగ్గర ఎవరు టీ తాగుతారు..ఇందులో కొత్త విషయం ఏమిటని కొట్టిపారేయకండి. అయితే ఇద్దరు యువకులు లక్షల విలువ చేసే ఆడీ కారులో వచ్చి ఈవిధంగా టీ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు యువకుల టీ వ్యాపారమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడీ చాయ్‌వాలా..
ముంబైకి చెందిన అమిత్ కశ్యప్ మరియు మను శర్మ అనే ఇద్దరు యువకులు బిజినెస్‌మెన్‌లుగా మారిపోయారు. డిగ్రీ పట్టాలు చేతిలో ఉండి కూడా టీ షాపు పెట్టుకోవాలని ఇద్దరు యువకులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ముంబైలోని లోఖండ్‌వాలా బ్యాక్‌రోడ్‌లో రోడ్డు పక్కన “ఆన్ డ్రైవ్ టీ స్టాల్” అని బోర్డు తగిలించుకొని మొబైల్ టీ స్టాల్‌ను చాలా స్టైలీష్‌గా నడుపుతున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ స్టార్టప్ బిజినెస్ ప్రారంభిచంిన అమిత్, మనుశర్మ ఇద్దరిలో ఒకరు ఎంబీఏ, మరొకరు బీటెక్ చేశారు. దీంతో మొదట్లో వీళ్లను ఎంబీఏ చాయ్‌వాలా అని మరొకర్ని ఆడీ టీ సెల్లర్ అంటూ పిలిచారు.