బెళగావి/ సాంగ్లీ: కుటుంబ సభ్యులంతా కలసి పెళ్లి చేసుకుంటున్న జంట ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనే ఆశతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు.
వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం చక్కగానే కాపురం చేశాడు. తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. పదేపదే భార్య తీరుతో విపరీతమైన అనుమానం పెంచుకున్న భర్త ఇక లాభం లేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి నెల కాకుండా భార్యను చంపేయడానికి భర్త రివాల్వర్ కొన్నాడు.
వివాహం చేసుకున్న కొన్నేళ్ల తరువాత తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను చంపేందుకు కంట్రీ మేడ్ పిస్టల్ కొనుగోలు చేశాడు. భార్య చంపేచాలని స్కెచ్ వేసిన భర్త ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు. .