TELANGANA

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ఏజెన్సీలో గల బబ్బిడి గిరిజన గ్రామంలో ప్రబలిన డయేరియా 25మంది కడుపునొప్పి,వాంతులు, విరోచనాలు, జ్వరంతో దుడ్డుఖళ్లు ఆసుపత్రిలో చేరిక…

వివరాల్లోకి వెళితే :

కురుపాం ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం మండలం, లోవముటా ప్రాంతమైన బబ్బిడి గ్రామానికి చెందిన పలువురికి నిన్ను అర్దరాత్రి నుండి తీవ్ర కడుపునొప్పి, వాంతులు,విరోచనాలు,జ్వరం వచ్చి తీవ్రం గా బాధపడుతూ ఈరోజు ఉదయం సమీప దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆసుపత్రిలో చేరారు వారిలో పలువురు చిన్నారులు ,మహిళలు ఉన్నారు వీరిలో కొందరి పరిస్దితి విషయం గా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కురుపాం హెల్త్ సెంటర్ కు తరించామని దుడ్డుఖళ్లు వైద్యాధికారి చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఒకే గ్రామానికి చెందిన 25మంది ఆసుపత్రిలో చేరారని వారిని సరిపడా వైదైయం అందిస్తున్నామని వారిలో కొందరి పరిస్దితి విషమంగా ఉండడంతో కురుపాం తరలించామని ఆదివారం నాడు గ్రామంలో విందు జరిగిందని విందు భోజనం వికటించడంతో ఈ బారిన పడే అవకాశం ఉందని లేదా కలుషితమైన నీరు తీసుకోవడం వలన వచ్చి ఉంటుందని తెలిపారు. గ్రామానికి చెందిన గోపన్న మాట్లాడుతూ ఏమైయిందో ఏమో తెలియదని 25మంది ఆసుపత్రిలో జబ్బఉబఆరఇన పడి బాధపడుతున్నారని నీటిలోని, ఆహారం వలనో మరి దేనివలన వచ్చింది తెలియడం లేదని తెలిపారు