CINEMA

చిరంజీవినే కారణం .. నా తప్పేం లేదు.. డైరెక్టర్ మెహర్ రమేష్..!!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇటీవల ‘ భోళాశంకర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై మొదటి షో నుంచి నెగటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ కోలుకునేది లేదని క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అంటూ రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. రిలీజ్ కి కొన్ని రోజుల ముందు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సర్కారుపై, కొంతమంది మంత్రులపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.

ప్రత్యేక హోదా, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ లాంటివి పట్టించుకోవడం మానేశారని గవర్నమెంట్ మాపై పడి ఏడిస్తే ఏమొస్తుంది అని పొలిటికల్ కామెంట్స్ విసిరారు. ఈ ప్రభావం భోళాశంకర్ సినిమాపై గట్టిగా పడిందని కొందరు పార్టీ కార్యకర్తలు చిరంజీవి సినిమా పై దృష్టి పెడితే మంచిదని సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ అనౌన్స్మెంట్ ఇవ్వడం వలన నీకే నష్టం అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక వర్గం సినిమాని పక్కన పెట్టిందని నెగిటివ్ ప్రచారం వలన సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

chiranjeevi bhola shankar movie flop reason
మరో పక్కన కొందరు సినిమా బాగుంటే పొలిటికల్ విమర్శలు ఏమాత్రం ప్రభావం చూపించవు, నిజంగా కంటెంట్ లో దమ్ము ఉంటే ఆడియన్స్ సినిమాని హిట్ చేస్తారు. ప్రేక్షకులు థియేటర్ ముందు క్యూ కడతారు. భోళాశంకర్ ఫ్లాప్ అవ్వడానికి మెహర్ రమేష్ టేకింగ్ అని వాదన. పాత చింతకాయ పచ్చడి సినిమాని తీసుకొని మరింత కిచిడిగా మార్చేసారని, చిరంజీవి లాంటి సీనియర్ నుంచి మహానటి లాంటి కీర్తి సురేష్ నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకోవడంలో పూర్తిగా రమేష్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఫ్లాప్ సినిమాకి