CINEMA

సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు.

దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది.


ఇందులో అభిమానులు అడిగిన ఎన్నో రకాల ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేశారు. ధనుష్ ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురయింది.. ఈ ప్రశ్నకు ధనుష్ ఏ మాత్రం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ అని తెలుపగా.. పవన్ కళ్యాణ్ పేరు చెప్పడంతో అభిమానులు ఖుషి అయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా ధనుష్ తెలివిగా అజిత్ విజయం ఇద్దరి పేర్లు తెలియజేయడం జరిగింది. కానీ ధనుష్ ఎక్కువగా అడిగితే రజనీకాంత్ పేరు చెప్పేస్తానని తెలిపారు.


ఇలా హీరోల గురించి మాత్రమే కాకుండా హీరోయిన్ల విషయంలో సమంత గురించి కూడా వాళ్ళు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.సమంత ఎంతో అద్భుతమైన నటి ఆమెతో కలిసి నటించడం నిజంగా తనకు చాలా గర్వంగా ఉంది అంటూ తెలిపారు ధనుష్. తనతో నటించే అవకాశం మళ్ళీ వస్తే ఖచ్చితంగా నటిస్తానంటూ తెలియజేశారు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు ధనుష్.