CINEMA

నోరా ఫతేహీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం

ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. ప్రముఖులను బెదిరించి, రూ. 200 కోట్లను వసూలు చేశాడన్న ప్రధాన ఆరోపణకు తోడు, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసు కూడా సుకేశ్ పై ఉంది. Sukesh gifted costly car to Actor Nora Fatehi :నోరా ఫతేహికి కూడా ఖరీదైన గిఫ్ట్ లు సుకేశ్ చంద్ర శేఖర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఖరీదైన బహుమతులు, బంగారు, డైమండ్ ఆభరణాలు, ఖరీదైన కార్లు కొనిచ్చారని ఈడీ భావిస్తోంది. ఈ విషయానికి సంబంధించి సెప్టెంబర్ నెలలో కూడా నోరా ఫతేహీని ఈడీ ప్రశ్నించింది. ఆ తరువాత, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను కూడా పలు పర్యాయాలు లోతుగా ప్రశ్నించింది. సుకేశ్ ఏర్పాటు చేశాడని భావిస్తున్న చెన్నై ఈవెంట్ కు సంబంధించి శుక్రవారం నోరా ఫతేహీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

అయితే, ఆ ఈవెంట్ గురించి తనకు ఏమీ తెలియదని నోరా జవాబిచ్చిందని, కానీ ఈడీ ఈ విషయమై ఆమెకు పలు సాక్ష్యాధారాలను చూపిందని ఈడీ వర్గాలు తెలిపాయి. అలాగే, సుకేశ్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన కారు, ఇతర బహుమతుల గురించి కూడా ఈడీ ఆమెను లోతుగా ప్రశ్నించింది. నోరా ఫతేహీ కెనడాకు చెందిన నటి, మోడల్, సింగర్. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో టెంపర్, కిక్2, లోఫర్ తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. Jaqueline Fernadez: సహ నిందితురాలిగా జాక్వెలిన్ ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సహ నిందితురాలిగా ఈడీ చేర్చింది. సుకేశ్ నుంచి ఒక ఫ్లాట్, కారు, ఖరీదైన ఇతర బహుమతులను జాక్వెలిన్ తీసుకుంది. అంతే కాకుండా, వారు విదేశీ పర్యటనలు కూడా చేశారని ఈడీ నిర్ధారించింది. ఆ ఖర్చులన్నీ సుకేశ్ బెదిరించి వసూలు చేసిన డబ్బుతో చేసినవేనని నిర్ధారించింది. ఈ కేసులో గత నెలలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.