CINEMA

IPL ఫ్రీగా చూడొచ్చు.. కానీ వినియోగదారులకు గట్టి షాక్ ఇదే

దేశంలో ఐపీఎల్ క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఈ ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ పూనకాలతో ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ కోసమే ఇన్నాళ్లు చాలా మంది ‘డిస్నీ +హాట్ స్టార్’ ప్యాకేజీని వేసుకునేవారంటే అతిశయోక్తి కాదేమో.. అయితే ఇప్పుడు స్టార్ గ్రూపు నుంచి హక్కులు అంబానీ గ్రూపుకు బదిలీ అయ్యాయి. ఇన్నాళ్లు హాట్ స్టార్ లో ప్రసారమయ్యే ఐపీఎల్ ప్రసార హక్కులు ఇక మారాయి. ఐపీఎల్ డిజిటల్ ప్రసారహక్కులను ముకేష్ అంబానీ నేతృత్వంలోని ‘వయాకామ్18’ మీడియా సొంతం చేసుకుంది. ఏకంగా 2.7 బిలియన్ డాలర్లకు ఈ హక్కులకు బిడ్ వేసి మరీ దక్కించుకుంది. ఈ సంస్థ జియో సినిమా యాప్ ద్వారా వీక్షకులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించే అవకాశం కల్పిస్తోందని సమాచారం. కానీ ఇక్కడే భారీ ట్విస్ట్ ఇచ్చింది జియో సంస్థ. జియో సినిమా ద్వారా ఇటీవల ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ తరహాలోనే అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్రీగా చూసేలా సంస్థ ఊరటని్చింది. పైగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాత్, బెంగాళీ, భోజ్ పురీ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో కామెంటరీ ఉండనున్నట్లు తెలిపింది. ఇక జియో సినిమా యాప్ లో 4కే రెజల్యూషన్ తో అల్ట్రాహెచ్డీ లో ప్రసాయం చేస్తామని తెలిపింది. ఇన్నాళ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ క్రికెట్ ప్యాక్ అంటూ రూ.400 వరకూ వసూలు చేసేది. కానీ జియో మొత్తం ఫ్రీగా ఇస్తోంది. కేవలం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వయాకామ్ మ్యాచ్ లను ఫ్రీగా ప్రసారం చేయాలని చూస్తోందట.. భారత్ లో గూగుల్, ఫేస్ బుక్ ఇలా ఫ్రీగా సేవలందిస్తూ ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయి. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా 4K లో చూడొచ్చని తెలిసి సంతోషిస్తున్నా.. ఒక్క ఐపీఎల్ 4K లో చూసేందుకు ఏకంగా 25 జీబీ , ఫుల్ హెచ్.డీ అయితే ఏకంగా 12జీబీ అవసరం పడుతుంది. నార్మల్ క్వాలిటీ అయినా కూడా 2.5 జీబీ అవసరం. దీంతో జీబీ కోసం ఐపీఎల్ అభిమానులు మళ్లీ ప్యాక్ లు వేసుకోవాలి. ఇది తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సబ్ స్క్రిప్షన్ ఎత్తివేసి ఇంటర్నెట్ బ్యాలెన్స్ తో జియో తన బిడ్డింగ్ డబ్బును వసూలు చేయనుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.