APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు.

ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన 1400 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో వదిలి రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా ట్రెడ్ అయ్యారు.

ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడడతంతో రాకేష్ మతిస్థిమితం కోల్పోయారని చాలా మంది విమర్శించారు. రాకేష్ మాస్టర్ ప్రస్తుతం కొంత మందితో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఆయన మరణం పట్ల పలువు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.