CINEMA

మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్30’ ఎట్టకేలకు లాంచ్..

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ లు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ 30 కాస్ట్ అండ్ క్రూ, ఏ జోష్ ని మైంటైన్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. దాదపు ఏడాది కాలంగా ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏవేవో కారణాల వల్ల ఎన్టీఆర్ 30 లాంచ్ వాయిదా పడుతూ వచ్చింది.

 

ఆర్ ఆర్ ఆర్, ఆస్కార్, తారకరత్న మరణం ఇలా ఎన్నో అవోరోధాలని దాటుకొని ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లార్జ్ స్కేల్, హ్యుజ్ బడ్జట్ తో రూపొందనున్న ఎన్టీఆర్ 30 మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అనిరుద్, ఎన్టీఆర్ కాంబో కోసం నందమూరి అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ అరవింద సమేత సినిమాకే రిపీట్ అవ్వాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. రీజనల్ సినిమా మిస్ అయినా పాన్ ఇండియా సినిమా మిస్ అవ్వకూడదు అన్నట్లు అనిరుద్ ని ఎన్టీఆర్, కొరటాల శివలు పట్టుబట్టి మరీ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోని వచ్చారు. మరి ఎన్టీఆర్ కి అనిరుద్ మ్యూజిక్ ఏ రేంజులో కొడతాడో చూడాలి.