AP

ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో   ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించింది. ఆమెకు 23 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. స్తవానికి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన.. కోటంరెడ్డి, ఆనం.. టీడీపీకి ఓటు వేసినా.. ఆ పార్టీ బలం 21కి చేరుతుంది. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచుమర్తి అనురాధ సాధించిన ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరింది వైసీపీ. వైసీపీ విజ్ఞప్తితో అనురాధకు వచ్చిన ఓట్లను మళ్లీ లెక్కించారు అధికారులు. రీకౌంటింగ్‌లోనూ ఆమె 23 ఓట్లు సాధించినట్లు వెల్లడైంది.

 

ఓటింగ్‌కు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలు. 16 మంది YCP ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ చెప్పినట్లుగానే క్రాస్‌ ఓటింగ్ జరిగినట్లు ఇప్పడు స్పష్టమవుతుంది.